వెబ్ కెమెరాలు ధరించనున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

వెబ్ కెమెరాలు ధరించనున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
వెబ్ కెమెరాలు ధరించనున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులకు శరీరంపై ధరించే వెబ్ కెమెరాలు తప్పనిసరి చేయనుంది. ఈ కెమెరాలు GPS వ్యవస్థ, రికార్డింగ్ సదుపాయం కలిగివుండటంతో పాటు 4జి టెక్నాలజీ సహాయంతో కంట్రోల్ రూం లో లైవ్ మానిటరింగ్ కి అనుసంధానమై వుంటాయి.  ఈ ఏర్పాటు తో పోలీసుల ప్రవర్తన, పనితీరు గణనీయంగా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జితేందర్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే ఇలాంటి నాలుగు కెమెరాలని పరీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ఒక్కొక్కటి 1.5లక్షలు ఖరీదు చేసే మరో 100 కెమెరాలు తెప్పించనున్నారు. వీటితోపాటు 360 డిగ్రీ సర్వేయలెన్స్ కెమెరాలు, ఇంటర్సెప్టర్ వాహనాలతో పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ  ను ఆధునీకరించనున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post